Tuesday, July 17, 2012

గజేంద్ర మోక్షము


గజేంద్ర మోక్షము

కం" శ్రీమన్నామ వయోద
     శ్యామ ధరాభృల్లలాయ ! జగదభిరామా
     రామా జనకామ మహొ
     ద్దామ ! గుణస్తోమ ధామ ! దసరథ రామా!

Wednesday, July 11, 2012


బమ్మెర పోతన విరచితం భాగవథం 


సీ. హరినామకథనదావానలజ్వాలచేన్ గాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేన్ దొలన్ గవే భవదుఃఖన్ తోయదములు
కమలనాభధ్యాన కంఠీరవంబుచెన్ గూలవే సంతాప కుంజరములు
నారయణస్మరణ ప్రభాకరదీప్తిన్ దీఱవే షడ్వర్గ తిమిర తతులు  

కుంతీదేవి శ్రీకృష్ణుని నుతించుట  

క. పురుషుం డాఢ్యుడు ప్రకృతికిన్,బరున్ డవ్యయున్ డఖిలభూత బహిరంతర్భా
సురుండును లోక నియంతయున్,బరమేశ్వరున్ డైన నీకున్ బ్రణతులగు హరి



బమ్మెర పోతన విరచితం


భగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలి కైనదమ్మిచూలి కైన
విబుధజనులవలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపఱతు


బమ్మెర పోతన విరచితం


పలికెడిది భాగవత మట
పలికించువిభుండు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేఱొండుగాథ పలుకగ నేలా





బమ్మెర పోతన విరచితం  


ఉ. అమ్మలంగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలంబె
ద్దమ్మ సురారులమ్మకడు పాఱడివుచ్చినయమ్మ దన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్త్వపటుత్వసంపదల్

Sunday, July 8, 2012

బమ్మెర పోతన విరచితం   

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారభకు భక్తపాలనకళాసంరభకున్ దానవో
ద్రేక స్తంభకున్ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

బమ్మెర పోతన విరచితం

శా" తల్లీ నిన్ను దలంచి పుస్తుకము చేతన్ బూనితిన్ నీవు నా
 యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశభ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతీ పూర్ణేందు బింబాననా 



Friday, July 6, 2012

కావ్య నిధి

కావ్య నిధికి ఇదే మా హృదయ పూర్వక అహ్వానం